27, మార్చి 2011, ఆదివారం
24, మార్చి 2011, గురువారం
11, మార్చి 2011, శుక్రవారం
నా తొలి కథ - అంపశయ్య
దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రచురితం అయిన తొలి కథ ఇది, ఇప్పుడు తిరిగి దీనిని చదివితే కలిగే భావాలు చెప్పడం కష్టం, ఎందుకంటే బాగుంది, బాగోలేదు, ఇష్టం అయిష్టం.. వగైరా భావాలన్నీ ఎన్నో పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నా నమ్మకం.
23 ఏళ్ళ వయసులో చావు గురించి వ్రాయడం నా పరిణతికి చిహ్నమని అప్పట్లో అనుకునేవాడిని, కానీ ఈనాటికి నాకు తెలియవచ్చింది ఏమిటంటే పరిణతి అనేది ఒక comparative పదమని ! అది నిన్నకీ రేపుకీ మధ్యలో మాత్రమే స్థిరంగా వుంటుంది.
1, మార్చి 2011, మంగళవారం
కులం ఎక్కడికీ పో(లే)దు బాస్ !
మొన్నా మధ్య circar express లో చెన్నైకి తిరిగి వస్తున్నాను. రాత్రి పది గంటలకనుకుంటా ఎవరో ఇద్దరు మనుషులు ఒకే స్టేషన్లో ఎక్కి నా ఎదురుగుండా వున్నా బెర్తులపై ఆసీనులయ్యారు. సహజంగానే మాటా మాటా కలుపుకున్నారు, చుట్టుప్రక్కల వారంతా పడుకున్నా ఎటువంటి సంకోచమూ లేకుండా బిగ్గరగా మాట్లాడ్డం మనకి అలవాటే కదా !
ఇంతలో ఒకాయన అంటాడు కదా - " నాకు ఆ రెండు అక్షరాలు అంటే ప్రాణం అండీ. "
దానికి రెండో ఆయన ఆ రెండు అక్షరాలని పూర్తి చేయడానికి తొందర పడ్డాడు " స్నేహం "ఆండీ ?
"అబ్బే కాదు " ముసిముసిగా నవ్వుతూ తిరస్కరించాడు మొదటాయన .
"నీతా "ఆండీ ? అని మళ్ళీ అడిగాడు రెండో వ్యక్తి .
" ఆహా అవన్నీ కాదండీ --" అంటూ ఓ కులం పేరు చెప్పాడు ఆ పెద్దాయన .
ఆ తర్వాత ఓ గంట వరకూ ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తమ కులానికి చెందినా ప్రసిద్ధులు ఎవరెవరు వున్నారో వారిద్దరూ తీరికగా నెమరు వేసుకున్నారు.
ఇప్పుడు చెప్పండి బాస్! మనం అభ్యుదయవాదులమంటూ ఎన్ని కబుర్లో చెబుతాము కానీ మన వ్యక్తిత్వంలో ఏదో ఓ మూల కులం హాయిగా కాపురముంటోంది, ఫలానా వ్యక్తి మన కులం వాడని తెలియగానే, మనసులో ఏదో ఒక తృప్తి , ఫలానా నటుడు మనవాడే, ఫలానా పళ్ళ డాక్టర్ మనవాడే..ఇంతలో ఒకాయన అంటాడు కదా - " నాకు ఆ రెండు అక్షరాలు అంటే ప్రాణం అండీ. "
దానికి రెండో ఆయన ఆ రెండు అక్షరాలని పూర్తి చేయడానికి తొందర పడ్డాడు " స్నేహం "ఆండీ ?
"అబ్బే కాదు " ముసిముసిగా నవ్వుతూ తిరస్కరించాడు మొదటాయన .
"నీతా "ఆండీ ? అని మళ్ళీ అడిగాడు రెండో వ్యక్తి .
" ఆహా అవన్నీ కాదండీ --" అంటూ ఓ కులం పేరు చెప్పాడు ఆ పెద్దాయన .
ఆ తర్వాత ఓ గంట వరకూ ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తమ కులానికి చెందినా ప్రసిద్ధులు ఎవరెవరు వున్నారో వారిద్దరూ తీరికగా నెమరు వేసుకున్నారు.
అప్లికేషను ఫార్మ్స్ లో , ఎలక్షన్లలో, ఉద్యోగాలలో, పెళ్ళిళ్ళలో, కార్పరేట్ కాలేజీలలో.. కులం ఎక్కడ లేదు చెప్పండి !
కులాన్ని పట్టించుకోం అని మనం చెబుతూనే వున్నాం, కానీ అవి మాటల వరకే, ఎందుకంటే మన అహంకారం, మన వ్యక్తిత్వం, మన బంధాలు, మన సంస్కృతి, మన రాజకీయం.. అన్నీ కులం చుట్టూనే వున్నాయి - కులం ఎక్కడికీ పో(లే)దు బాస్ !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)