కొన్ని రోజుల క్రితం సాక్షి పత్రికలో Caso చేత గీయబడిన Escaping critisism అనే చిత్రాన్ని చూసాను, ఎందుకనో ఆ చిత్రం నాకు మహా బాగా నచ్చింది, మనుషుల స్వభావం ఏమిటంటే వాళ్లకి బాగా నచ్చిన వస్తువులని అతిగా వాడి అన్నా పాడు చేస్తారు లేదా అతిగా భద్రపరిచన్నా పాడు చేస్తారు.నేను కూడా ఆ చిత్రాన్ని నా ఇష్టంతో పాడు చేసాను, దాని ఫలితం ఈ దిగువన చూడగలరు ( ఫోటో షాపికి కృతఙ్ఞతలు )
16, ఫిబ్రవరి 2011, బుధవారం
13, ఫిబ్రవరి 2011, ఆదివారం
విశ్వనాథ్ 'సూత్రధారులు'
ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్ననే విశ్వనాథ్ 'సూత్రధారులు' మళ్ళీ చూసాను, ఎంత బాగుందో ! తెలుగు సంస్కృతి నేపధ్యంలో పెత్తందారులపై బడుగు జనాల విప్లవాన్ని ఎంతో గొప్పగా చూపించాడు విశ్వనాథ్ m.v.s. Haranatha Rao డైలాగులు కూడా కొన్ని చోట్ల ఎంతో అద్భుతంగా పండాయి ( ముఖ్యంగా climax లో ), కానీ నాకు గుర్తున్నంత వరకూ అప్పట్లో ఈ సినిమా ఒక ఫ్లాప్, శంకరాభరణం సినిమాని ఆదరించామని మహ గొప్పగా చెప్పుకునే మనం ఎన్ని మంచి సినిమాలకి పాడె కట్టామో కదా!
9, ఫిబ్రవరి 2011, బుధవారం
మళ్ళీ మొదలు బాబూ
దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ బ్లాగులో మొదటి పోస్టింగ్ ప్రచురిస్తున్నాను, బహుశా దీని బట్టే నేను ఎంతటి కార్యసాధకుడినో చెప్పవచ్చు, అయితే ఇక ముందు ముందు ఇంతటి నైరాశ్యం లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)